అభివృద్ధి వికేంద్రీకరణపై గౌరవ సుప్రీం కోర్టు నుంచి స్పష్టమైన తీర్పు వచ్చిందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శాసనసభ చట్టాలు చేయవద్దంటే ఎలా..? ఏ వ్యవస్థ కూడా పరిధి దాటకూడదని అభిప్రాయపడ్డారు. మూడు రాజధానులతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని సీఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని, అలాంటి గొప్ప నిర్ణయాన్ని అడ్డుకునేందుకు రైతుల పేరుతో చంద్రబాబు బినామీ యాత్రలు చేయించారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి మూడు రాజధానులే పరిష్కారమన్నారు.