ప్రపంచకప్ ఆడేందుకు ఖతర్‌కు వచ్చిన ఇరాన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికాతో జరిగే మ్యాచ్‌లో తమ ఆటగాళ్ల ప్రవర్తన సరిగ్గా లేకపోతే జైళ్లల్లో పడేస్తామని, కుటుంబాలకు టార్చర్ అంటే ఏంటో చూపెడతామని హెచ్చరించింది. గెలిచినా ఓడినా నోరు మూసుకుని ఉంటేనే మంచిదని, లేకపోతే కటకటాలు తప్పవని ఆదేశించినట్టు సీఎన్‌ఎన్ కథనంలో పేర్కొంది. ఇటీవల ఇంగ్లాండ్‌తో మ్యాచ్ సమయంలో ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక నిరసనలకు మద్దతుగా ఇరాన్ ఆటగాళ్లలో కొందరు జాతీయగీతం పాడేందుకు విముఖత వ్యక్తం చేయడం సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్ అనంతరం ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తమ జట్టు ఆటగాళ్లందరితో మీటింగ్ ఏర్పాటు చేసి బెదిరించినట్లు సమాచారం.