దేశ భవిష్యత్తును నిర్దేశించే యువతకు ఓటు పై అవగాహన అవసరమని ఆముదాలవలస తాసిల్దార్ వైవి పద్మావతి అన్నారు. బుధవారం ఆమదాలవలస టి ఎస్ ఆర్ డిగ్రీ కళాశాలలో మండల ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ఓటు హక్కు ఎన్ రోల్ మెంట్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో డిగ్రీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 18సంవత్సరాలు వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని సూచించారు. ఓటు హక్కు నమోదు ఒక సామాజిక బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, అధ్యాపకులు విద్యార్థులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.