ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. సాఫ్ట్ వేర్ సంబంధిత సాంకేతిక సమస్య కారణంగా ఆధార్ సేవలను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఈ సమస్యను పరిష్కరించి ఆధార్ సేవలను తిరిగి ప్రారంభించడానికి ఐదు రోజుల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ నమోదు కోసం 1400 గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వం ఆధార్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే.