పిల్లల నుంచి పెద్దల వరకూ శీతాకాలంలో జలుబు, దగ్గు, ఇన్ ఫెక్షన్ వంటివి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంటాయి. ఇలాంటి సమయంలో వెల్లుల్లిని మన ఆహారంలో తప్పకుండా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వెల్లుల్లిని నమలడం లేదా చూర్ణం చేసి తినడం వల్ల తెల్లరక్త కణాల సామర్థ్యం పెరుగుతుందని చెబుతున్నారు. బీపీ కంట్రోల్ సహా, కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించడం, గుండె జబ్బుల నివారణకు వెల్లుల్లి దివ్యౌషధమని పేర్కొంటున్నారు.