డిసెంబర్ లో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. గత 3 నెలలుగా మూఢాల కారణంగా శుభకార్యాలు నిలిచిపోయాయి. అయితే నవంబర్ 27తో మూఢాలు తొలగిపోయాయి. దీంతో డిసెంబర్ మొదటి వారం నుంచే పెళ్లిళ్లు జరగనున్నాయి. ఈ నెలలో 5 శుభ ముహుర్తాలు ఉన్నట్లు పురోహితులు చెబుతున్నారు. డిసెంబర్ 4, 8, 14, 17, 18వ తేదీల్లో దివ్యమైన ముహుర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ నెలలో అదనపు ముహుర్తాలు కూడా ఉన్నప్పటికీ ఈ 5 తేదీల్లో దివ్యమైన ముహుర్తాలు ఉన్నాయట. ఈ ముహుర్తాల తర్వాత మళ్లీ జనవరి 16వరకు పెళ్లి ముహుర్తాలు లేవని, మళ్లీ ఫిబ్రవరిలోనే ఉన్నాయని చెబుతున్నారు.