గుజరాత్ లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల అధికారులు 14,382 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేశారు. అయితే ఉమర్గామ్ లో ఓ వందేళ్ల వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 100 ఏళ్ల కముబెన్ లాలాభాయ్ పటేల్ తన ఓటు వేశారు. ప్రస్తుత కాలంలో ఓటు వేసేందుకు బద్దకిస్తున్న చాలా మందికి ఆమె ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ వయసులో కూడా తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.