పెరుగిపోతున్న వడ్డీ రేట్లు, కమోడిటీ ధరలు ఆర్థిక వ్యవస్థ వృద్ధి చక్రాలకు బ్రేకులు వేశాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతానికి మందగించింది. తొలి త్రైమాసికమైన 2022-23 ఏప్రిల్-జూన్‌లో కనపర్చిన 13.5 శాతం వృద్ధి రెండో త్రైమాసికంలో సగానికిపైగా తగ్గింది. 2011-12 బేస్ ధరల ప్రకారం 2022-23 క్యూ2లో జీడీపీ రూ.38.17 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించింది. 2021-22 ద్వితీయ త్రైమాసికంలో ఇది రూ.35.89 లక్షల కోట్లు. దీంతో నిరుడుకంటే 6.3 శాతం వృద్ధి సాధించినట్లయ్యింది.