విద్యార్థులపై ఎలుకలు దాడిచేసిన ఘటనపై గుత్తి మండలంలోని సేవా ఘడ్ గిరిజన గురుకుల పాఠశాల వద్ద బుధవారం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా నిర్వహిం చారు. పాఠశాల ప్రధాన గేటు వద్ద నాయకులు విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు సి. రమేష్ మాట్లా డుతూ వైకాపా ప్రభుత్వం హాస్టళ్ల నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరించ టంతోనే విద్యార్థులపై ఎలుకలు దాడి చేశాయన్నారు. నాడు నేడు అంటూ కోట్లాది రూపాయలతో పాఠశాలలు రూపులు మారుస్తున్న జగన్ రెడ్డికి పేద విద్యార్థులు చదువు కుంటున్న హాస్టళ్లను విస్మరించడం శోచనీయం అన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించా లని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శీనా నాయక్, కృష్ణ, రవి నాయక్, వంశీ, పవన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.