దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 409 పాయింట్ల లాభంతో 63,509 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో 18,869 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.02 వద్ద కొనసాగుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లడం వరుసగా ఇది 8వ రోజు. సెన్సెక్స్ 30 సూచీలో విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎల్ అండ్ టీ, హెచ్ సీఎల్ టెక్, టాటా స్టీల్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.