డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమైన ఎలక్ట్రానిక్స్, స్టార్టప్‌లు, ఐటీ-ఐటీ ఆధారిత సర్వీసుల రంగాల్లో వచ్చే రెండేళ్ల కాలంలో కోటి ఉద్యోగాల కల్పించటమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు టెలికం మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఎలక్ట్రానిక్స్ తయారీ, ఐటీ-ఐటీఈఎస్, స్టార్టప్‌లు మూడు ముఖ్య స్తంభాలుగా అభివర్ణించిన ఆయన, ఈ రంగాలు ఇప్పటికే 88-90 లక్షల మందికి కొత్తగా ఉపాధి కల్పించి నట్టు చెప్పారు. వచ్చే రెండేళ్లలో ఇది సులభంగానే కోటి దాటుతుందన్నారు. స్టార్టప్‌లను ఏర్పాటు చేసుకునేందుకు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలను కల్పిస్తున్నట్టు మంత్రి వైష్ణవ్ తెలిపారు.