తాను గెలిచి రెండేళ్లవుతున్నా ఇప్పటి వరకు నా వార్డులో అభివృద్ధి జరగలేదంటూ దీంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికార పార్టీ కౌన్సిలర్, మునిసిపల్ చైర్పర్సన్ ఇంద్రజకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. బుధవారం శ్రీసత్యసాయిజిల్లా హిందూపురం మునిసిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. అయితే 35 అంశాలను మూడు నిమిషాల్లోనే ముగించారు. కానీ 20 నెలలవుతున్నా తన వార్డులో లక్ష రూపాయలు అభివృద్ధి పనులు జరగలేదని దీంతో వార్డు సభ్యులకు తాను ఏం సమాధానం చెప్పాలంటూ 20వ వార్డు కౌన్సిలర్ పరుశురాం అన్నారు.