జిల్లాలో నేటి నుండి పౌరసరఫరాల దుకాణాల ద్వారా డిసెంబర్ నెల కోటకు సంబంధించి బియ్యంతో పాటు, కందిపప్పు, చక్కెరలను రేషన్ దారులకు అందజేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లాలో 6, 55, 525 బియ్యం కార్డులు ఉండగా, ఎండియూ వాహనాల ద్వారా నేడు రేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు సంబంధించిన శాఖ అధికారులు వెల్లడించారు. రాయితీ పోను కిలో కందిపప్పు రూ. 67, చక్కెర అరకిలో రూ. 17లకు ఇవ్వనున్నట్లుగా తెలిపారు.