వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ విజ్ఞేశ్వర కాలనీ నందు అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని బుధవారం రాత్రి వేటపాలెం ఎస్సై జి సురేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతడిని అరెస్టు చేసి 21 మద్యం సీసాలను స్వాధీనం పరుచుకున్నారు. ఎవరూ బెల్టు మద్యం దుకాణాలు నడప రాదని, పరిమితికి మించి మద్యం సీసాలు కలిగి ఉండరాదని ఎస్ఐ సురేష్ ఈ సందర్భంగా హెచ్చరించారు. నిరంతరం దాడులు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. కానిస్టేబుల్ అలెగ్జాండర్, హోంగార్డు వినోద్ దాడుల్లో పాల్గొన్నారు