ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇలా చేస్తే కడుపునొప్పి మటుమాయం

Life style |  Suryaa Desk  | Published : Thu, Dec 01, 2022, 01:25 PM

కడుపు నొప్పి అస్సలు వర్ణించలేని బాధ. కడుపునొప్పి నుంచి బయటపడేందుకు చాలా మంది మందులు వాడుతుంటారు. అయితే మన వంటింట్లోని పలు చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. కాసిన్ని అల్లం ముక్కలను నీళ్లలో వేసి కాసేపు మరిగించాలి. ఇప్పుడు ఈ నీటిని ఫిల్టర్ చేసి కొంచెం తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని రోజుకు 2 నుండి 3 సార్లు తాగాలి. ఇది కడుపు నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. .సోంపు కూడా నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందు కోసం మీరు ఒక కప్పు నీటిలో ఒక చెంచా సొంపు వేసి దీన్ని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టి చల్లార్చండి. తరువాత ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి తేనె కలిపి సేవించండి. మీరు దీన్ని రోజుకు 2 నుండి 3 సార్లు తాగవచ్చు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com