ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కేఎస్ పల్లి గ్రామంలో గురువారం రాధా అనే మహిళ అనుమానాస్పద మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం నుంచి కనిపించకుండా పోయిన రాధ స్థానిక గ్రామ సమీపంలోని మొక్కజొన్న పొలంలో శవమై తేలుంది. సమాచారాన అందుకున్న పోలీసులు సంఘటన స్థలాలు చేరుకొని మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఫిరోజ్ తెలిపారు.