భారత రాజ్యాంగ ప్రాముఖ్యం, తద్వారా ఏర్పాటైన చట్టాలతో ప్రయోజనాలను విద్యార్థులు తెలుసుకోవాలని డీఎల్ఎస్ఏ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎస్. కవిత సూచించారు. కడప నగరం జయనగర్ కాలనీలోని యాదాల రంగమ్మ జిల్లా ప్రజాపరిషత్ బాలికల పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ అనే అంశంపై క్విజ్, వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.