ప్రొద్దుటూరు మండల పరిధిలోని కాకిరేనిపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పధకాలను వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్, సర్పంచ్ లక్ష్మీదేవి, వైసీపీ పట్టణాధ్యక్షుడు కామిశెట్టి బాబు, గ్రామ వైసీపీ నాయకులు కృష్ణారెడ్డి, రామమోహన్ రెడ్డి, ఎంపీటీసీ భరత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.