మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి గురువారం ఉదయం సీబీఐ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. వివేకా హత్య కేసు తెలంగాణకు బదిలీ నేపథ్యంలో సునీతా.. సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. రెండు రోజుల క్రితం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సుప్రీంకోర్టు ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేసిన విషయం తెలిసిందే.