వైసీపీ పార్టీ నాయకులూ, మంత్రి గుమ్మనూరు జయరాం భార్య రేణుకమ్మకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. బినామీ యాక్టు కింద నోటీసులు జారీ అయ్యాయి. కర్నూలు జిల్లా అస్పరిలో కొనుగోలు చేసిన 30.83 ఎకరాల భూమి కొనుగోలు లావాదేవీలపై ఐటీ నోటీసులు పంపింది. రూ. 52.42 లక్షల విలువైన భూ కొనుగోళ్లకు సంబంధించిన లెక్కలు చూపడం లేదని నోటీసులో పేర్కొన్నారు. మొత్తం 180 ఎకరాల భూమిలో రేణుకమ్మ పేరు మీద 30.83 ఎకరాలున్నట్టు వెల్లడించారు. మిగిలిన భూమి కూడా మంత్రి గుమ్మనూరు జయరాం బంధువుల పేరు మీదే రిజిస్టర్ అయినట్టు గుర్తించామన్నారు. ఒకే రోజున మంత్రి భార్య, బంధువులు, సన్నిహితుల పేర్లతో 180 ఎకరాల భూమి రిజిస్టర్ చేసినట్టు ఐటీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు.