అనంతపురం జిల్లాలో ఈనెల 2వతేదీ నుంచి తానా(ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన) ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ఫౌండేషన ట్రస్టీ పురుషోత్తంచౌదరి గూడె, అగ్రికల్చర్ ఫోరం కోఆర్డినేటర్ రఘు ఎద్దులపల్లి తెలిపారు. బుధవారం అశోక్‌నగర్‌లోని తానా క్యాంపు కార్యాలయంలో కళ్యాణదుర్గానికి చెందిన బీటెక్ చదువుతున్న పేద విద్యార్థి రక్షితకు తానా సభ్యులు రూ.75వేలు విలువ చేసే ల్యాప్‌టాప్ అందజేశారు. ఈ సందర్భంగా పురుషోత్తం చౌదరి, రఘు మాట్లాడుతూ పదేళ్లుగా తానా ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుమారు రూ.300కోట్లతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. తానా చైతన్య స్రవంతి ద్వారా ఈనెల 2 నుంచి జనవరి 7వతేదీ వరకు రూ.5కోట్లతో ఉమ్మడి ఏపీలో సేవ కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు.