ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ పోరు హోరాహోరీగా జరుగుతుంది. ఈ క్రమంలో ఇటీవల అమెరికా చేతిలో ఇరాన్ జట్టు ఓడిపోవడంతో అక్కడి ప్రజలు దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. హిజాబ్ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఇరాన్ జట్టు ఫిఫాలో మ్యాచులు ఆడేందుకు వెళ్లడంపై ఆగ్రహించిన ఇరానీయులు జట్టు ఓటమిని అలా సెలబ్రెట్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ ఓటమిని సెలబ్రేట్ చేసుకుంటున్న ఓ వ్యక్తిని ఇరాన్ భద్రతా బలగాలు కాల్చి చంపాయని హక్కుల సంఘాలు బుధవారం తెలిపాయి. టెహ్రాన్‌కు వాయువ్యంగా ఉన్న బందర్ అంజాలి నగరంలో మెహ్రాన్ సమక్ అనే యువకుడిని కాల్చిచంపినట్లు ఓస్లోలోని ఇరాన్ హ్యూమన్ రైట్స్ గ్రూప్ వెల్లడించింది. తలపై కాల్చి సమక్ ను చంపినట్లు తెలిపింది.