శ్రీకాకుళంనగరంలో స్థానిక క్యాంప్ ఆఫీసులో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు భూ హక్కు పత్రాలను సంబంధిత అర్హులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రెవెన్యూ గ్రామాలలో పారదర్శకంగా రీ సర్వే చేసి, వివాదాలకు చెక్ పెడుతూ భూ హక్కు పత్రాలు అందిస్తున్నామని అన్నారు. ఇందుకు వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని ఈ రీ సర్వేను చేయిస్తున్నామని చెప్పారు. ఇప్పటిదాకా ఎప్పుడో 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారు చేసిన సర్వేనే మనం ఫాలో అవుతున్నామన్నారు. ఇవే గ్రామాల్లో ఉన్న తగాదాలకు ప్రధాన కారణం అవుతోందన్నారు. వీటికి కారణంతమ భూమికి సంబంధించి సరైన రుజువు చూపే రికార్డ్ లేకపోవడమే, అందుకు కారణం సరైన ప్రభుత్వం ఎన్నిక చేసుకోకపోవడంమే! రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు భూ భారతి అని ప్రారంభించామన్నారు. జగన్ పాదయాత్ర లో భూ సమస్యలూ, సంబంధిత తగాదాలూ గమనించారని తెలిపారు. అందుకే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. దాసన్న రెవెన్యూ మంత్రిగా ఉన్నపుడు మన జిల్లాలో ప్రారంభించామని, ఆస్తి అనేది వివాద రహితంగా ఉండాలన్నది మా ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డఓ శాంతి, ఏమర్వోలు వెంకట్రావు, సుధసాగర్, ఎంపిపి గోండు రఘు రాం, అంబటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.