చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అస్సాం ప్రభుత్వం భారీ కానుక అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటర్ లో మెరిట్ సాధించిన విద్యార్థులకు సీఎం హిమంత బిశ్వ శర్మ స్కూటర్లను పంపిణీ చేశారు. బాలురు 75 శాతం.. బాలికలైతే 60 శాతం స్కోర్ సాధిస్తే సరిపోతుంది. ఈసారి 35,800 మందిని ఎంపిక చేసింది. ఇక పీజీ చదివే విద్యార్థినులకు ఏడాదికి రూ.10 వేల స్టైఫండ్ అందజేసే పథకాన్ని తీసుకురానున్నట్లు సీఎం తెలిపారు. విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని సీఎం సూచించారు.