ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని కేంద్ర ప్రభుత్వం మరింత శక్తివంతం చేసింది. ఈడీ పరిధిలోకి మరో 15 సంస్థలను తీసుకువస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికోసం పీఎంఎల్ఏ చట్టంలోని 66వ నిబంధనలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. రాష్ట్ర పోలీసు విభాగాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఈడీ పరిధిలోకి తీసుకువచ్చింది. ఈడీ కోరిన ఏ సమాచారాన్ని అయినా ఇవ్వాల్సిందేనంటూ నోటిఫికేషన్లో కేంద్రం వెల్లడించింది. విదేశాంగ శాఖ, ఎన్ఐఏ తో పాటు మరో 15 కేంద్ర మంత్రిత్వశాఖలను కేంద్రం ఈడీ పరిధిలోకి తీసుకొచ్చింది.