ఎయిమ్స్‌కు చెందిన ఐదు సర్వర్లు హ్యాక్ అయ్యాయని IFSO వర్గాలు తెలిపాయి. దీంతో లక్షలాది రోగుల వ్యక్తిగత వివరాలు ప్రమాదంలో పడతాయనే ఆందోళన నెలకొంది. ఈ సైబర్ దాడిలో చైనా హ్యాకర్ల ప్రమేయం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. చోరీ చేసిన డేటాను డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టనున్నట్టు సమాచారం. చోరీకి గురైన ఎయిమ్స్ డేటా కోసం డార్క్ వెబ్‌లో 1600కుపైగా సెర్చ్‌లు సాగినట్టు వెల్లడైంది. అటు డేటా లీక్‌పై FSL బృందం ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తోంది. అయితే ఎలాంటి డేటా నష్టం జరగలేదని ఐఎఫ్ఎస్ఓ అధికారులు పేర్కొన్నారు