ఎన్నికల్లో గెలవడానికి నాయకులు యువత, ప్రజలకు రకరకాల హామీలిస్తుంటారు. అయితే గుజరాత్ లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మగన్ భాయ్ సోలంకి మాత్రం వినూత్న రీతిలో ప్రచారం చేశాడు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పొడవాటి మీసాలు పెంచుకునే యువతకు ప్రత్యేక భత్యం ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానంటూ హామీ ఇస్తున్నాడు. సబర్ కాంత జిల్లాకు చెందిన 57 ఏళ్ల సోలంకి 2012లో ఆర్మీ నుంచి పదవీ విరమణ పొందారు.