దేశంలో క్రిప్టో కరెన్సీ అంటే ఏంటో కూడా తెలియనివారు ఎంతో మంది ఉన్నారు. అలాంటిది ఓ టీ స్టాల్ యజమాని తన షాప్‌లో పేమెంట్లను క్రిప్టోలో కూడా చేయొచ్చని బోర్డు పెట్టడం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గొయెంకా అతడి గురించి ట్విట్టర్‌లో షేర్ చేశారు. 'న్యూ ఇండియా (ఆధునిక భారతదేశం)' అంటూ పొగిడారు. ఇక టీ షాప్ యజమానులంటే నిరక్షరాస్యులేమో అని చాలామంది అభిప్రాయం. అయితే ఫ్రస్టేడెట్ డ్రాప్అవుట్ పేరుతో బెంగళూరులో ఈ స్టాల్‌ను శుభం సైనీ అనే BCA డ్రాప్ అవుట్ ఏర్పాటు చేశాడు. తన షాప్ గురించి పోస్ట్ చేసిన గొయేంకాకు థ్యాంక్స్ చెప్పిన సైనీ సరికొత్త భారత్ కోసం తనవంతు కృషి చేస్తానన్నాడు.