దేశం కొవిడ్ బారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుండగా.. తాజాగా మంకీపాక్స్, జికా వైరస్ కలకలం రేపుతున్నాయి. పుణెలో ఓ జికా వైరస్ కేసు నమోదు కాగా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. నవంబర్ 16న పుణెలోని జహంగీర్ ఆస్పత్రికి ఓ బాధితుడు అనారోగ్యంతో రాగా అనుమానంతో పరీక్షలు చేయగా జికా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో బాధితుడు నివసించే ప్రాంతంలో శానిటైజ్ చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.