జాత్యహంకార ధోరణిని ఎప్పుడైనా, ఎక్కడైనా తప్పనిసరిగా ఎదిరించాలని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. బ్రిటిష్ రాజకుటుంబంలో జాత్యహంకార ధోరణి వెలుగు చూసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. బాల్యంలో తాను కూడా జాత్యహంకారన్ని ఎదుర్కొన్నానని, అయితే ఇప్పుడు దేశం పురోగమించిందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అయితే బ్రిటన్ రాజ కుటుంబం గురించి కానీ, ఇటీవల అక్కడ వెలుగు చూసిన సంఘటన గురించి కానీ సునాక్ నేరుగా ప్రస్తావించలేదు.