ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో పేరుకుపోయిన అవినీతిని కడిగేందుకు తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అక్కడి ఓటర్లను కోరారు. డిసెంబర్ 4న మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వ్యాపారులతో నేడు సమావేశమయ్యారు. ఢిల్లీలో అధికారం తమది ఉంటే, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ చేతిలో ఉందని దాంతో వాయు, నీటి కాలుష్య నివారణకు ఏమీ చేయలేకపోతున్నామని అన్నారు.