కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వ దర్శనానికి నేరుగా భక్తులు క్యూలో వెళ్లి దర్శించుకుంటున్నారు. దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం స్వామి వారిని 64,586 మంది భక్తులు దర్శించుకోగా.. 27,501 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.3.90 కోట్ల విలువైన కానుకలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.