ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు శ్రీరాముడి నైతిక జీవనాన్ని అనుకరించడం లేదని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన శుక్రవారం అగర్ మాల్వాలోని ర్యాలీలో మాట్లాడారు. ‘మహాత్మాగాంధీ ఉచ్చరించే హేరామ్ అంటే ఒక జీవన విధానమని.. ప్రేమ, సోదర భావం, తపస్సు అర్థాన్ని ప్రపంచానికి నేర్పింది’ అని ఒక సాధువు తనకు చెప్పినట్లు రాహుల్ పేర్కొన్నారు. మహిళలకు గౌరవ కల్పించేందుకు బీజేపీ నేతలు పాటు పడడం లేదని అన్నారు.