ఇటీవల కాలంలో అపార్ట్మెంట్లు, ఆఫీసులు, ఆసుపత్రులలో లిఫ్ట్‌లలో పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని నిరాలా ఆస్పైర్ సొసైటీలో ఇదే తరహా ఘటన జరిగింది. ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న బాలుడు లిఫ్ట్‌లో చిక్కుకుపోయాడు. సహాయం చేయాలని బాలుడు గట్టిగా ఏడుస్తూ కేకలు వేశాడు. ఎమర్జెన్సీ బటన్ నొక్కినా ఫలితం లేకపోయింది. సీసీ టీవీ పర్యవేక్షించాల్సిన సెక్యూరిటీ సిబ్బంది కూడా పట్టించుకోలేదు. వాకింగ్‌కు వెళ్తున్న ఓ వ్యక్తి ఆ బాలుడిని కాపాడాడు. బాలుడు లిఫ్ట్‌లో ఇరుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.