డ్రోన్లు, డ్రోన్ల విడి భాగాలకు సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం మార్గదర్శకాలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం రూ.120 కోట్ల కేటాయింపు ప్రణాళికతో పీఎల్ఐ పథకాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ఒక్కో తయారీదారుకు పీఎల్ఐ పరిమితి రూ.30 కోట్లు. డ్రోన్ల విడిభాగాల సంస్థలకు రూ.50 లక్షలు. భారత్ లో డ్రోన్లు, డ్రోన్ల విడి భాగాలను తయారు చేస్తున్న కంపెనీలకే పీఎల్ఐ పథకాన్ని పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది.