ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ లబుషేన్ వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో పరుగుల వరద పారిస్తున్నాడు. తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ సాధించిన లబుషేన్, తాజాగా రెండో ఇన్నింగ్స్ లోనూ సెంచరీ బాదేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 204 పరుగులు చేసిన లబుషేన్, సెకండ్ ఇన్నింగ్స్ లో 104 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం సాధించింది. ఈ టెస్టులో వెస్టిండీస్ గెలవాలంటే ఇంకా 489 పరుగులు చేయాల్సి ఉంది. ఇంకా నేడు, రేపు ఆట మిగిలి ఉంది.