జీ20 సమావేశానికి భారత్ నేతృత్వం వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పర్యాటక ప్రాతం చెంగల్పట్టు జిల్లా మహాబలిపురంలో ఏర్పాటు చేసిన లేజర్ షో ఆకట్టుకుంది. మహాబలిపురం కొండపై ‘వెన్నముద్ద’ రాయిగా ప్రఖ్యాతి గాంచిన బండపై ‘జీ20 మీటింగ్’ లోగోతో లేజర్ షో పర్యాటకులను కట్టి పడేసింది. ఈ క్రమంలో రాయి వద్ద ఎంతో ఉత్సాహంగా సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.