చలికాలం వచ్చేసింది. దానితో పాటు ఫ్లూ, జలుబు వంటి అనేక రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉండటానికి రోగనిరోధక శక్తిపై కొంచెం అదనపు జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. చల్లటి వాతావరణంతో చాలా మంది బయటకు రాకుండా ఇంట్లో ఉండేందుకే ఆసక్తి చూపిస్తుంటారు. ఇది వారి రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. చలికాలం రోగనిరోధక శక్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలి. చలికాలం ఉదయం ఒక కప్పు గ్రీన్ టీ తాగాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచే సాధనంగా పనిచేస్తుంది. చిలగడదుంపలు, క్యారెట్లు, యాలకులు వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి.