ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్త ఎఫైర్.. పిల్లలకు విషమిచ్చి ఆపై భార్య ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Sat, Dec 03, 2022, 12:08 PM

భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని ఓ మహిళ సహించలేకపోయింది. పిల్లలకు విషమిచ్చి చంపి, తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని మండ్య జిల్లా మద్దూరు పట్టణంలో జరిగింది. అఖిల్ అహ్మద్, ఉస్నా కౌసర్ భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. మెకానిక్‌గా చేసే అహ్మద్ కొన్నాళ్లుగా ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీనిపై పెద్దలు పంచాయతీ పెట్టి, దంపతులకు రాజీ కుదిర్చారు. అయినా అహ్మద్ తీరు మారలేదు. దీంతో గురువారం రాత్రి పిల్లలకు విషమిచ్చి కౌసర్ చంపేసింది. ఆపై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com