యూపీలోని కాన్పూర్ సమీపంలోని కళ్యాణ్‌పూర్‌లో దారుణం జరిగింది. వీధి వ్యాపారులపై పోలీసులు శుక్రవారం సాయంత్రం ప్రతాపం చూపించారు. అర్సలాన్ అనే వీధి వ్యాపారి కూరగాయలను, తూకం రాయిని పోలీసులు విసిరేశారు. అవి రైల్వే ట్రాక్‌పై పడ్డాయి. వాటిని ఏరుకునేందుకు వెళ్లగా అతడిని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అర్సలాన్ రెండు కాళ్లూ తెగిపడ్డాయి. భరించలేని బాధతో బాధితుడు విలవిల్లాడిపోయాడు. పోలీసులపై వస్తున్న ఆరోపణలను పశ్చిమ అదనపు డీసీపీ లఖన్ యాదవ్ ఖండించారు. బాధితుడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.