బంగ్లాదేశ్ తో మూడు వన్డేల సిరీస్ ముందు టీమిండియాకు షాక్ తగిలింది. గాయం కారణంగా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. భుజం గాయంతో షమీ బాధపడుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. షమీ స్థానంలో భారత యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ కు జట్టులో చోటు కల్పిస్తున్నట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. కాగా, వన్డే సిరీస్ తో పాటు ఈ నెల 14 నుండి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ కూ షమీ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. 'వన్డే సిరీస్ కు షమీ లేకపోవడం లోటే. అయితే టెస్టు సిరీస్ కూ అతడు దూరమైతే ఇది అంతకంటే పెద్ద ఆందోళనే ' అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.