గూగుల్, ఆల్ఫాబెట్ కంపెనీల సీఈఓ సుందర్ పిచాయ్ కు అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు పద్మభూషణ్‌ను ప్రధానం చేశారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సుందర్ పిచాయ్‌కి పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేయనున్నట్లు హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.‘‘పద్మభూషణ్ ఇచ్చినందుకు రాయబారి సంధు, కాన్సుల్ జనరల్ ప్రసాద్‌లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అపారమైన గౌరవానికి భారత ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నన్ను తీర్చిదిద్దిన దేశం ఇలా గౌరవించడం అర్థవంతంగా ఉంది’’ అని సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు.