ఏపీలోని వైద్య విద్యార్థులు ఇకపై జీన్స్, టీషర్టులు ధరించకూడదని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మ్మాయిలతో చీర, చుడీదార్‌తో రావాలని, జట్టును వదులుగా వదిలేయొద్దని, పురుషులైతే క్లీన్ షేవ్‌తో రావాలంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలపై డీఎంఈ స్పందించింది. ఈ వార్తలను నమ్మొద్దని, ఈ విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని డీఎంఈ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. విధుల్లో ఉన్న సమయంలో ఆరోగ్యశాఖ ఉద్యోగులు, వైద్యులు స్టెతస్కోప్, యాప్రాన్, ఐడీ కార్డు ధరించాలన్న అంశంపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుగుతున్నట్టు ఆయన చెప్పారు.