అఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ లోని పాక్ రాయబార కార్యాలయంపై దాడి జరిగింది. శుక్రవారం ఎంబసీ ఆవరణలో వాకింగ్ చేస్తున్న పాక్ రాయబారి ఉబైదుర్ రెహ్మాన్ నిజామనీపై ఓ గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. అయితే సెక్యూరిటీ గార్డు అప్రమత్తతతో రెహ్మాన్ సురక్షితంగా తప్పించుకున్నారు. సెక్యూరిటీ గార్డుకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిని పాక్ ప్రధాని షెహబాద్ షరీఫ్ ఖండించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాయబారితో పాటు ఇతర అధికారులను పాక్ తాత్కాలికంగా వెనక్కి పిలిచింది. ఈ ఘటనపై తాలిబన్ అధికారులు స్పందించాల్సి ఉంది.