ఈ భూమిలో ఎక్కడా లేని విధంగా హరిహరాదులు ఇద్దరు ఒకే వేదికపై నిత్య కళ్యాణాలు జరుపుకుంటున్న కమలాపురం మండలం శ్రీరామాపురం మహా పుణ్యక్షేత్రంలో మార్గశిర మాస శుక్ల ఏకాదశి శనివారం ఉత్తర ద్వార ప్రవేశం చేసి శ్రీ మహాలక్ష్మీ మోక్ష నారాయణ స్వామి వారిని శ్రీ వల్లి దేవసేన షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని శ్రీ సంజీవిని మూలికా సహిత వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకుని మహాభాగ్యం భక్తాదులకు కలుగుతుంది. ప్రతి మాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు భూలోక వైకుంఠంగా భావించే ఈ ఆలయంలో దేవదేవులు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తుంటారు. ఆగే ప్రతి శుక్ల ఏకాదశి కి సాయంత్రం గరుడ వాహనంపై మహాలక్ష్మి మోక్ష నారాయణ స్వామి వారిని మాడవీధుల ఉత్సవ నిర్వహించడం ప్రత్యేక విశేషం. ఆలయ ప్రధాన సేవకులు కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో ఉత్తర ద్వార దర్శనానికి తగిన ఏర్పాట్లు చేశారు.