మంగళగిరి నగర పరిధి చినకాకాని ఎన్నారై ఆసుపత్రితో పాటు విజయవాడ లోని అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిలో ఆదాయపన్ను శాఖ అధికారుల సోదాలు శనివారం రెండవ రోజు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈడీ అధికారులు శనివారం ఉదయం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. గతంలో పలువురు ఎన్నారై ఆసుపత్రి డైరెక్టర్లపై నమోదైన కేసుల వివరాలను పోలీస్ అధికారులను అడిగి తెలుసుకుని అందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ప్రతులను తీసుకున్నారు.