మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి క్షేత్రాన్ని సందర్శించేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేశారు. తొలుత నాగపుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేసి అనంతరం స్వామివారి దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఆలయ ఈవో చక్రధర్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.