నేవీ డే-2022 సందర్భంగా విశాఖలో ఈ నెల 4న ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. రామకృష్ణ బీచ్ రోడ్ లో ఎన్‌టీఆర్ విగ్రహం నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు నౌకాదళ యుద్ద విన్యాసాలు జరుపుతున్నారు. నేవీ డేకు భారత దేశ రాష్ట్రపతితో వీవీఐపీలు కూడా రానున్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ నాలుగు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ శ్రీకాంత్ ఆదివారం వెల్లడించారు.
కలెక్టరేట్ జంక్షన్ నుంచి నేవల్ కోస్టల్ బ్యాటరి, నేవల్ కోస్టల్ బ్యాటరి నుంచి పార్క్ హోటల్ వరకు, సిరిపురం జంక్షన్ నుండి చినవాల్తేరు మీదుగా పార్క్ హోటల్ వరకు, సిరిపురం జంక్షన్ నుండి ఆలిండియా రేడియో జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ విగ్రహం వరకు, ఆలిండియా రేడియో జంక్షన్ నుంచి పాండురంగాపురం డౌన్ వరకు, నేవల్ కాంటీన్ జంక్షన్ నుండి నావెల్ కోస్ట్ బ్యాటరి వరకు, పందిమెట్ట జంక్షన్ నుండి నొవెటల్ హోటల్ వరకు, సెంచరీ క్లబ్ నుండి నొవెటల్ హోటల్ వరకు పాస్ లేని వాహనములు అనుమతించబోమన్నారు.
ఎంవీపీ కాలనీ వైపు నుంచి వచ్చే వాహనదారులు వుడా పార్క్ ప్రక్కన గల ఎంజీఎం గ్రౌండ్, వుడా పార్క్, జయశ్రీ సై కృష్ణ టావెల్స్ పార్కింగ్ ప్లేస్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్ గ్రౌండ్, కురుపాం టవర్స్ దగ్గర గల విశాఖ ఫంక్షన్ హాల్, కామత్ హోటల్ వద్ద గల ఆర్‌ఆర్ కనస్ట్రక్షన్స్ లలో తమ వాహనములను పార్క్ చేసుకోవాలని పోలీసులుసూచించారు. పార్క్ హోటల్ మీదుగా బీచ్ రోడ్ కి రాకుండా బీచ్ లోన వున్న ఎన్‌క్లోజర్స్ లోనికి కాలి నడకన వెళ్లాలి. పార్క్ హోటల్ నుంచి ఎటువంటి వాహనాలను బీచ్ రోడ్ లోకి అనుమతించరు.
జగదాంబ , దండుబజార్ వైపు నుండి వచ్చు వాహనదారులు కలెక్టర్ ఆఫీస్ జంక్షన్, జిల్లాపరిషత్ జంక్షన్ మీదుగా ఆంధ్ర యూనివర్సిటీ మెడికల్ కాలేజీ స్పొర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్, అంకోస గ్రౌండ్, అంకోస ఎదురుగా గల జూబిలీ హోం గ్రౌండ్, లలో తమ వాహనములను పార్క్ చేసుకొని కలెక్టర్ ఆఫీస్ జంక్షన్, నావెల్ కోస్ట్ బ్యాటరీ జంక్షన్ మీదుగా బీచ్ రోడ్ కి రాకుండా బీచ్ లోన వున్న ఎన్‌క్లోజర్స్ లోనికి కాలి నడకన వెళ్ళవలెను.
సందర్శకుల రద్దీని బట్టి రుషికొండ జంక్షన్, జోడుగుల్లపాలెం జంక్షన్, కురుపాం జంక్షన్, ఎంవీపీ డబుల్ రోడ్, మద్దిలపాలెం జంక్షన్, టైకూన్ జంక్షన్, అసీలుమెట్ట జంక్షన్, గొల్లలపాలెం జంక్షన్, పందిమెట్ట జంక్షన్, జగదంబ, టౌన్ కొత్త రోడ్, కలెక్టర్ ఆఫీస్ జంక్షన్, జిల్లాపరిషత్ జంక్షన్ల వద్ద మళ్ళింపు చర్యలు తీసుకోనున్నారు.
నేవల్ కోస్టల్ బ్యాటరి నుండి పార్క్ హోటల్ వరకు నివసిస్తున్న వారు పోలీస్ వారికీ సహకరించి ఈ కార్యక్రమమును దిగ్విజయం చేయవలసినదిగ కోరడమైనది. అత్యవసరమైన పరిస్థితులలో తప్ప ఆ దినము ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వాహన రాకపోకలు జరుపరాదు.
కలెక్టరేట్ జంక్షన్ మరియు సీఆర్ రెడ్డి సర్కిల్ వద్ద ఇతర వాహనములు రాకుండా కట్ ఆఫ్ పాయింట్స్ ఉన్నందున నేవల్ కోస్టల్ బ్యాటరి నుండి పార్క్ హోటల్ వరకు నివసిస్తున్న వారు పోలీస్ వారికీ సహకరించి, ఫై తేది, ఫై సమయములలో వారి రాక పోకలను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవలసినదిగ విజ్ఞప్తి చేశారు. నగరప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా సీపీ శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa