కేంద్రం రేపు (సోమవారం) అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో భారత్ నిర్వహించనున్న జి-20 సదస్సుకు సంబంధించిన సూచనలు, వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి దాదాపు 40 మంది పార్టీ అధ్యక్షులను ఆహ్వానించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్నారు. అయితే పశ్చిమ బెంగాల్ సీఎంగా కాకుండా తృణమూల్ కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ హోదాలో తాను ఈ సమావేశంలో పాల్గొంటానని మమత తెలిపారు.