రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడకు చేరుకున్నారు. అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము మాట్లాడుతూ తెలుగు భాష, తెలుగు సాహిత్యం దేశ ప్రజలందరికీ సుపరిచితమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్న రాష్ట్రపతిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. పోరంకిలో ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమంలో రాష్ట్రపతిని గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలు సత్కరించారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ తెలుగు భాష గొప్పతనం యావత్ దేశానికి తెలుసన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని ముర్ము కొనియాడారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, అందరికి కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.